Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్! 650సీసీ పవర్.. క్లాసిక్ లుక్‌తో.. 7 d ago

మన దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు 'బుల్లెట్ బండి' అనే పేరుతో ప్రత్యేక అభిమానం ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా..అందరూ ఈ బైక్‌లను ఇష్టపడతారు. మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే.. కొద్ది రోజుల్లో 650 సీసీ క్లాసిక్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డిజైన్ & స్టైలింగ్:
క్లాసిక్ 650 బైక్.. క్లాసిక్ 350 మోడల్ రూపకల్పనను పోలిఉంది. రౌండ్ LED హెడ్‌లైట్, 'టైగర్ లైట్స్' లేదా పైలట్ ల్యాంప్‌లు, టియర్ డ్రాప్ ఆకారపు ఆయిల్ ట్యాంక్, సింగిల్ సీటు (వెనుక సీటు ఆప్షనల్) ఈ 650 మోడల్ ప్రత్యేకతలు. బేర్ 650 మినహా ఇతర 650సీసీ మోడళ్లలగే.. ఇది కూడా డ్యూయల్ ఎగ్జాస్ట్‌లను కలిగి ఉంటుంది.
ఫీచర్లు మరియు సాంకేతికత:
క్లాసిక్ 650లో ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. పూర్తి LED లైటింగ్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్ట్‌బుల్ బ్రేక్ & క్లచ్ లివర్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. క్లాసిక్ 350 బైక్‌లో ఉన్నట్లుగానే.. ఇందులో కూడా సెమీ-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది ఇంధన స్థాయి, గేర్ సూచిక, ఓడోమీటర్ మరియు గడియారాన్ని చూపుతుంది.
హార్డ్‌వేర్ మరియు ధ్రువికరణ:
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌తో రూపొందించబడింది. ఇది 120mm ట్రావెల్‌తో అందించే 43mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంది. వెనుక సస్పెన్షన్ 90mm ట్రావెల్‌తో రెండు షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉంది. బైక్‌కి 320mm ఫ్రంట్ డిస్క్ మరియు 300mm బ్యాక్ డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంది. 800mm సీటు ఎత్తు, 154mm గ్రౌండ్ క్లియరెన్స్, మరియు 14.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో.. రైడర్లకు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
పవర్‌ట్రెయిన్:
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సీసీ శ్రేణిలోని ఇతర మోడళ్లలో ఉపయోగించిన 648సీసీ ప్యారలల్-ట్విన్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజన్ 46.4 bhp శక్తిని మరియు 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు స్లిప్ & అసిస్ట్ క్లచ్ కలయికతో.. ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సున్నితంగా, సౌకర్యవంతంగా మార్చుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ మార్చి 27, 2025న విడుదల కానుంది. ఇది క్లాసిక్ 350 రూపంతో.. 650సీసీ ఇంజన్‌తో వస్తోంది. గుండ్రటి హెడ్‌లైట్, కన్నీటి ఆకారపు ట్యాంక్, సింగిల్ సీటు దీని ప్రత్యేకతలు. LED లైటింగ్, టైప్-C ఛార్జింగ్, సెమీ-అనలాగ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. 648సీసీ ఇంజన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. చూడటానికే కాదు నడపడానికి కూడా చాల బాగుంటుంది. ఈ బైక్ ధర సుమారుగా రూ. 3.5 లక్షలు ఉండవచ్చు.
ఇది చదవండి: పోకో M7 5G ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ!